ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. 8వ నెలలో అబార్షన్ కి అనుమతి

-

ఢిల్లీ హైకోర్టు మంగళవారం 35 వారాల గర్భిణీకి అబార్షన్ చేయించుకోవడానికి అనుమతిని ఇచ్చింది. ఓ మహిళ తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. సంబంధిత పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం గర్భాన్ని తొలగించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం కేవలం 24 వారాల గర్భాన్ని మాత్రమే అబార్షన్ చేయించుకునే ఛాన్స్ ఉంది.

అయితే మహిళకు ఉండే అనారోగ్యం సమస్య కారణంగా కోర్టు ఈ పర్మిషన్ ఇచ్చింది. ఆ మహిళ కడుపులో పెరుగుతున్న పిండంలో మెదడుకు సంబంధించిన వ్యాధిని గుర్తించినట్లు తన పిటిషన్ లో 26 ఏళ్ల మహిళ పేర్కొంది. దీంతో తల్లి నిర్ణయమే అంతిమం అని భావించిన హైకోర్టు పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. భారతీయ చట్టాల ప్రకారం గర్భధారణ తర్వాత ప్రసవించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునే హక్కు మహిళదే అని కోర్టు పేర్కొంది. అయితే గతంలో కూడా కొన్ని కేసులలో కోర్టులు ఇలాంటి తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news