థర్డ్‌ ఫ్రంట్‌ కు అడుగులు..ఇవాళ కేసీఆర్‌ తో కేరళ సీఎం కీలక సమావేశం

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌… గత కొన్ని రోజుల నుంచి… కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ ను పడగొడితేనే… ఇండియాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మోడీ సర్కార్‌ ను పడగొట్టేందుకు… ఏ పార్టీతోనైనా పనిచేసేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఇవాళ సీపీఎం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్‌ తో సీపీఎం పార్టీ నేతలతో… భేటీ కానున్నారు. కేరళ సీఎం విజయన్‌, మరో ఇద్దరు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అయితే.. ఈ సమావేశంలో… సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కూడా హాజరు కానున్నారు. దీంతో థర్డ్‌ ఫ్రంట్‌ కోసం ఈ భేటీ జరుగనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే… కేరళలో పెట్టుబడులపై చర్చ కోసం ఈ సమావేశం జరుగుతున్నట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే….దీనిపై క్లారిటీ రావాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news