ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతున్నవారికి కేశవరావు సమాధానం..

-

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుండి తెలంగాణ రాజకీయం చాలా మారింది. విమర్శలు, ప్రతి విమర్శల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ, 1.36లక్షల ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారని, ఇంతవరకూ వాటిపై ఎలాంటి చర్య జరగలేదని ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ ప్రశ్నలకి సమాధానంగా తెలంగాణ రాజ్యసభ సభ్యుడు కేశవరావు సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో 1.36లక్షల నియామకాలు జరిగాయని, ఏ ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయో ప్రభుత్వం ఇప్పటికే లెక్కలు చూపించిందని, అనుమానాలుంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చునని, లెక్క తక్కువైతే రాజీనామా చేసి రాజకీయాల నుమ్డి తప్పుకుంటానని సవాల్ విసిరారు. మొత్తానికి అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు బాగా ముదిరిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ విషయంలో ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news