మూడు నెలల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి : తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

-

తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పరిస్థితుల పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మూడు నెలల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో సిబ్బందికి 2 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని హైకోర్టు ఆదేశించింది.  రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో 10శాతమే ఆర్టీపీసీఆర్ జరుగుతున్నాయన్న హైకోర్టు… కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ కార్యచరణ ప్రణాళికలో జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది.

రెండు సార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు సమర్పించలేదని డీహెచ్ ను ప్రశ్నించింది హైకోర్టు.. సీసీజీఆర్ఏపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విధాననిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న డీహెచ్… ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా.. కోర్టు ఆదేశాలు అమలు చేయరా? అని హైకోర్టు నిలదీసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హైకోర్టు… ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. కరోనాపై తదుపరి విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news