తిరుమల దర్శనానికి వెళ్ళే భక్తులకు కీలక సూచన…

-

ప్రపంచం నలుమూలల నుండి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఏపీలోని తిరుపతి జిల్లా తిరుమలకు వస్తారు. సీజన్ ఏదైనా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తి వస్తారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం తిరుమలలో గత రెండు రోజుల నుండి విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. మామూలుగా ఎటువంటి టికెట్ లేని వారికి కల్పించే సర్వదర్శనం కోసం దాదాపు 18 గంటలు క్యు లోనే వేచి ఉండే పరిస్థితి అక్కడ నెలకొంది.

అందుకే భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్ లు మొత్తం ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు ఉండేవారు దర్శనం చేసుకోవడానికి ఈ రోజు రేపు పట్టే అవకాశం ఉంది. అందుకే తిరుమల వెళ్లాలని అనుకున్న వారు మరో రెండు రోజులు ఆగి వెళితే ఈ రద్దీ తగ్గుతుందని తెలుస్తోంది. మరియు తిరుమలలో మీకు తెలిసిన వారి ఉన్నట్లు అయితే వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని వెళ్ళడం మరీ మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఇంటర్, టెన్త్ విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయినందున తిరుమల దర్శనానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువయింది.

Read more RELATED
Recommended to you

Latest news