ఏపీ ఆదాయం పెరుగుతోంది : ఆర్థిక మంత్రి బుగ్గన కీలక ప్రకటన

-

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కీలక ప్రకటన చేశారు. టీడీపీ నేతలు మరోసారి రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని.. రాష్ట్రం రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తుంటే ఓర్వలేకే అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సానుకూల వృద్ధి దిశగా పయనిస్తుంటే తిరోగమన వృద్ధి అని ప్రచారం చేస్తున్నారని.. వైసీపీ సర్కార్ హయాంలో 2019-20 లో వృద్ధి రేటు పెరిగిందన్నారు.

కరోనా కష్టాలతో మధ్యలో తగ్గినా ఇప్పుడు పరిస్ధితులు సానుకూలంగా మారాయని.. కరోనాలోనూ తలసరి ఆదాయలు పడిపోకుండా చూశామని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు తగ్గుతోందని కాగ్ చెప్తున్నా… టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని.. 2020-21లో కేంద్రంతో పోలిస్తే ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు రాష్ట్రంలో తక్కువేనని చురకలు అంటించారు.

ప్రతీ అప్పుకూ, ప్రతీ ఖర్చుకూ లెక్కలున్నాయని.. ప్రత్యక్ష నగదు బదిలీలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్ధానంలో ఏపీ ఉందని గుర్తు చేశారు. ఏపీ ఆదాయం పెరుగుతుందని.. జీఎస్డీపీ వృద్ధి రేటు 2019-20లో 7.23%కి పెరిగిందని స్పష్టం చేశారు. జీఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ది నాలుగో స్థానమన్నారు. ఇదే GSDP వృద్ధి రేటు 2017-18లో 10.09% నుండి 2018-19లో 4.88%కి తగ్గిందని.. దీనికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news