రైతులకు మోడీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..వ్యవసాయ రుణం పరిమితి పెంపు !

-

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు 2022 -23 బడ్జెట్‌ లో ప్రభుత్వం వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1 వ తేదీన సాధారణ బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు. ప్రభుత్వం ఏటా వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని పెంచుతూ వస్తుంది.

ఈ సారి కూడా ఆ లక్ష్యాన్ని రూ. 18 నుంచి 18.5 లక్షల కోట్లకు పెంచవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి వారంలో.. బడ్జెట్‌ గణాంకాలను ఖరారు చేస్తూనే ఈ లక్ష్యాన్ని ఫిక్స్‌ చేయవచ్చని సంబంధిత వర్గాల స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వార్షిక వ్యవసాయ రుణ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ఇందులో పంట రుణాల లక్ష్యం కూడా ఉంది. ఈ తరుణంలో.. రుణ పరిమితిని పెంచేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది. కాగా.. నిన్న టి రోజున పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో పడ్డ సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news