ఏపీలో ముందస్తు..తమ్ముళ్ళు తేల్చేస్తున్నారు!

-

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..తెలంగాణలో మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది…ఎప్పుడైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు రావొచ్చని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంటున్నాయి…గతంలో మాదిరిగా మరోసారి ముందస్తుకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి…అలెర్ట్‌గా ఉండాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి.

TDP
TDP

ఇక ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో కూడా నడుస్తోంది…జగన్ సైతం ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉందని ప్రతిపక్ష టీడీపీ భావిస్తుంది. అసలు ఎప్పుడు ఎన్నికలోచ్చిన సిద్ధంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిస్తున్నారు..అలాగే ఇప్పటినుంచే అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేసేస్తున్నారు…వాస్తవానికి ఏపీలో 2024 ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయి.

కానీ జగన్ ఎప్పుడైనా ప్రభుత్వం రద్దు చేసి ముందస్తుకు వచ్చే ఛాన్స్ ఉందని టీడీపీ శ్రేణులు అలెర్ట్‌గా ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని, ఈ వ్యతిరేకత పూర్తిగా పెరిగే లోపు ఎన్నికలకు వెళ్లిపోతే బెటర్ అని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు..అలాగే టీడీపీ ఎన్నికలకు రెడీగా లేని సమయం చూసుకుని ముందస్తుకు వెళ్లొచ్చని చెబుతున్నారు. కాబట్టి ఇప్పటినుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు..టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

జగన్ కలలో లేచి ప్రభుత్వం రద్దుకు లేఖ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు…అంటే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోతారనే విషయంలో టీడీపీ శ్రేణులు బాగా నమ్మకంతో ఉన్నాయి..కానీ వైసీపీలో ముందస్తుపై చర్చ జరగడం లేదు..తమకు ఐదేళ్లు పూర్తి సమయం ఉందని, కాబట్టి ఐదేళ్ల పాటు పూర్తిగా అధికారంలో ఉంటామని చెబుతున్నారు…కానీ వైసీపీని నమ్మడానికి వీల్లేదని, పీకే డైరక్షన్‌లో ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లొచ్చని టీడీపీ భావిస్తుంది. చూడాలి మరి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ముందస్తు వైపు మొగ్గు చూపుతారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news