బీజేపీ కార్యకర్త గణేష్ మృతి మంత్రి పువ్వాడ, పోలీసులు చేసిన హత్యే: బండి సంజయ్

-

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త గణేష్ అధికార పార్టీ వేధింపులకు పాల్పడటంతో ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికి మంత్రి పువ్వాడ అజయ్, పోలీసులు చేసిన హత్యే అని తీవ్రంగా విమర్శించారు బండి సంజయ్. ఎక్కడ అవినీతి జరిగినా  ఎంతపెద్ద అధికారి, రాజకీయ నాయకుడైనా గణేష్ ప్రశ్నిస్తాడని…ధర్మం కోసం పని చేస్తాడని అన్నాడు. మంత్రి పువ్వాడ అజయ్ అవినీతిని ప్రశ్నిస్తే గణేష్ పై కేసులు పెట్టారని.. పోలీసులు 16 కేసులు పెట్టారని.. బీజేపీ కార్యకర్త కావడం వల్లే పీడీ యాక్ట్ పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ బలుపెక్కి ప్రవర్తిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్, ఆయన మంత్రులకు కండఖావరం పెరిగిందని, అధికారం తలకెక్కిందంటూ విమర్శించారు. అవినీతి, దోపిడి చేసి డబ్బులు సంపాదించుకుని దాచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అవినీతిని ప్రశ్నించినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేశారని పోలీసులపై ఆరోపించారు. పోలీసులు చేసిన వేధింపులకు గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించాడని అన్నారు. పరోక్షంగా అధికార పార్టీ, పోలీసులు గణేష్ చనిపోయేలా చేశారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news