ఏపీకి మరో శుభవార్త చెప్పింది కియా మోటర్స్. ఏపీలో కియా మరో రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్దమైంది. ఏపీలోని అనంతపురం ప్లాంట్ లో వచ్చే నాలుగేళ్లలో రూ.2000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కార్ల తయారీ సంస్థ కియా ఇండియా ప్రకటించింది.
ఎలక్ట్రిక్ వాహనాల పరిశోధన, అభివృద్ధి, తయారీ, మౌలిక వసతులకు ఆ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. కాగా, దేశీయంగా తయారైన ఎలక్ట్రిక్ కియా కారణం 2025 లో ఆవిష్కరించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తుంది. అంతర్జాతీయంగా 2027 నాటికి 14 ఎలక్ట్రిక్ మోడల్లను ప్రవేశపెట్టనుంది.