కథల విషయంలో కింగ్ నాగార్జున కన్ఫ్యూజన్ పోయిందా?

-

కింగ్ నాగార్జున కు ఒకప్పుడు పట్టిందల్లా బంగారం అయ్యేది. ఇప్పుడు తాను కథల విషయంలో, డైరెక్టర్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ముందు మోహన్ రాజా తో ఒక పక్క తన సినిమా ది ఘోస్ట్ ప్లాప్ కావడం అలాగే గాడ్ ఫాదర్ సినిమా కూడా అంతగా వసూళ్ళు సాధించక పోవడంతో  మోహన్ రాజా తో సినిమా చేసే విషయంలో నాగార్జున ఆలోచనలో పడ్డారని వార్తలు వనిపిస్తున్నాయి

అలాగే తన కెరీర్‌లో వందో సినిమాను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు హీరో నాగార్జున. ఆల్రెడీ నాగార్జున కొన్ని కథలు విన్నారు. మరికొన్ని కథలు వినడానికి రెడీ అవుతున్నారు. కాగా తన గత చిత్రం ‘ది ఘోస్ట్‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వేదికగా తాను, అఖిల్‌ కలిసి ఓ మలీ్టస్టారర్‌ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు నాగార్జున. ఇదే ఆయన కెరీర్‌లో వందో సినిమాగా ఉండబోతుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌ నడుస్తోంది.

ప్రస్తుతం నాగార్జున నెక్స్ట్ సినిమా ప్రసన్న కుమార్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. నాగార్జున మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉంటుందని టాక్. నాగ్ కూడా ప్ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేయాలని చూస్తున్నారట. సీనియర్ హీరోలు అందరూ మంచి సినిమాలు చేస్తూ హిట్స్ సాధిస్తూ ఉంటే ఒక్క నాగార్జున మాత్రమే హిట్ లేకుండా ఉన్నాడని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇందుకే నాగార్జున కూడా బిగ్ బాస్ షో ను కూడా వదిలి పెడుతున్నాడు అని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version