రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ

-

తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వినియోగించుకోవాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటకలో ఆఫ్ స్క్రీన్, ఏపీలో ఆన్ స్క్రీన్ పాత్ర పోషించనున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలతో టచ్ లోకి వెళ్లాలని కిరణ్ కుమార్ రెడ్డికి బిజెపి హైకమాండ్ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి యడ్యూరప్పతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని రాజంపేట లోక్సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. త్వరలో పార్టీలో చేయబోయే మార్పులు, చేర్పులో జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

ఏమాత్రం వీలున్న ఈలోగా జాతీయ కార్యదర్శి పదవిని కిరణ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టే అంశాన్ని బిజెపి హై కమాండ్ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేయాలని చెప్పేందుకు సోము వీర్రాజుకు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news