ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్దం : కిషన్ రెడ్డి

-

ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులలోనూ ధాన్యం కొనుగోలుపై వెనుకడుగు వేయదన్నారు. ఒప్పందం మేరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్దామని స్పష్టం చేశారు. 26 వేల 600 కోట్లు తెలంగాణ లో దాన్యం కొనుగోలు మీద  కేంద్రం పెడుతుందని.. బీజేపీ ఎప్పుడు కూడా ఫలానా పంట వేయాలని చెప్పలేదన్నారు. దాన్యం వర్షం లో తడిచిపోతుంటే కొనుగోలు చేయొద్దని బీజేపీ ప్రభుత్వం చెప్పిందా ? అని నిలదీశారు.

కేసీఆర్ మాత్రం ఒక్కోసారి ఒక్కో పంట వేయాలని చెప్పారని.. ప్రస్తుత పంట కొనకుండా వచ్చే పంట గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దాన్యం కొనేది కేంద్రమే అని టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చెప్పింది చాలా సంతోషమన్నారు. నిన్న డిల్లికి వచ్చిన మంత్రులు వ్యూహాత్మకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని.. కేసీఆర్ పట్ల అన్ని వర్గాల ప్రజలు ప్రధానంగా తెలంగాణ ఉద్యమం లో కీలకంగా పని చేసిన వారు అసంతృప్తి తో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ అవినీతి ,కుటుంబ, నియంతృత్వ పాలన పట్ల విసుగు చెందారని.. కవులు కళాకారులు మీద ఈ ప్రభుత్వం కత్తి కట్టిందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రగతి భవన్ ప్రధాన ఎన్నికల కార్యాలయంగా మారింది… ఎంత అణచివేత చేస్తే అంత తిరుగుబాటు ఉంటుందని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news