ఓమిక్రాన్ ఎఫెక్ట్… అర్థాంతరంగా రద్దైన ప్రపంచకప్ అర్హత టోర్నీ..

-

ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ గజగజ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన B.1.1.529 వేరియంట్ ప్రస్తుతం ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రిాకా, నమీబియా, బోట్స్ వానా, జింబాబ్వే, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయిల్ దేశాల్లో కొత్తగా ఓమిక్రాన్ (B.1.1.529) వేరియంట్ కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో బ్రిటన్, సౌదీ, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు.. కొత్త వేరింట్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. ఆయా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. దీని దెబ్బకు  WTO మంత్రుల సమావేశం కూడా వాయిదా పడింది.corona-virus

ఇదిలా ఉంటే తాజాగా క్రికెట్ టోర్నీకి ఓమిక్రాన్ ఎఫెక్ట్ తగిలింది. జింబాబ్వేలో జరుగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ అర్హత టోర్నీ అర్ధాంతరంగా రద్దైంది. జింబాబ్వే దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా ఉండటమే కారణం. కరోనా వ్యాప్తి భయంతోనే ఈ మ్యాచులను ఐసీసీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయంపై ఐసీసీ క్లారిటీ ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news