కేసీఆర్‌ పాలన నిజాం పాలనను తలపిస్తోంది : కిషన్‌ రెడ్డి

-

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ఫైర్‌ అయ్యారు. బీఆర్‌ఎస్ తెచ్చిన ధరణితో రైతుల సమస్యలు తగ్గకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన నిజాం పాలనను తలపిస్తోందని, నిజాం పాలనలో చూసిన అరాచకాలన్నీ కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు చూస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్.. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని, తమను ఎదిరించేవారిని అధ:పాతాళానికి తొక్కేయడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

BRS not a 'B' Team of BJP: Kishan Reddy - Telangana Today

ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించకుండా.. కల్వకుంట్ల కుటుంబం అహంకారపూరితంగా వ్యవహరిస్తుండటంతో.. ధరణి వంటి సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

‘ధరణి’ అంశంపై తమకే తప్పు తెలియదన్నట్లుగా ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికలో ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రకటన విడుదల చేయించారని ఆయన ఆరోపించారు. తమ తప్పు బయటపడొద్దని సదరు ప్రైవేట్ కంపెనీ వెనుక సర్కారు దాక్కున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ధరణి కారణంగా 75 లక్షల మంది రైతులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేస్తున్న వారినుంచి భరోసా కల్పించాల్సింది పోయి.. కేసీఆర్ తన అసమర్థతను మరోసారి బట్టబయలు చేసుకునేలా ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రకటన ఇచ్చుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news