ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనని కిషన్ రెడ్డి భావించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల అభీష్టం మేరకే ఏపీ బీజేపీ అమరావతి రాజధానికి మద్దతుగా నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రైతుల మేలును దృష్టిలో పెట్టుకునే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని చెప్పారు. ఇదిలా ఉండగా నేడు జరుగున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ రాజధాని పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాసేపట్లో అసెంబ్లీ లో సీఎం జగన్ రాజధానిపై ప్రకటన చేయనున్నారు. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ పై సీఎం ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం కొత్తగా ఏ బిల్లులు లేనట్టే..అని సమాచారం అందుతోంది. అంతే కాకుండా మారోసారి ప్రజాభిప్రాయ సేకరణ, నిపుణులు కమిటీ లు వంటి పక్రియ జరిగిన తరువాత ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.