కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు పోతారని అంటున్నారని…ఓట్లు తొలగించటం, నాయకులను బెదిరించటం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ అనేక…ప్రయత్నాలు చేస్తున్నారని…ఎపుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధం అని కుండబద్దలు కొట్టి చెప్పారు. లిక్కర్ స్కాములో ఎవరున్నారనే దానిపై సీబీఐ తెలుస్తోందన్నారు.
కేసీఆర్ తెలిసి మాట్లాడుతున్నారా.. లేక తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిందే పది సార్లు చెప్పి, ప్రజలను భ్రమ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల పరిపాలన విధానమా ? అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.ఫామ్ హౌస్ లో ఉండటంలో మోడల్ అంటూ ఎద్దేవా చేశారు. ధర్నా చౌక్ పై నిషేధం పెట్టిన గొప్ప ప్రజాస్వామ్య వాది కెసిఆర్ అని అన్నారు. 15 శాఖలు కల్వకుంట్ల కుటుంబంలో పెట్టుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఎన్నికల్లో ఫండింగ్ ఇస్తానని తన పర్యటనల్లో అక్కడి పార్టీలకు హామీ ఇస్తున్నాడని ఆరోపించారు.