బండ్లగూడ చెరువు పరిధిలో ముంపుకు గురైన మల్లికార్జున నగర్, అయ్యప్ప నగర్, త్యాగరాయ నగర్ లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సంధర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మానవ తప్పిదం వల్లే హైదరాబాద్ లో భారీగా నష్టం జరిగిందని అన్నారు. దాని వలన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆయన అన్నారు.
రాజకీయ నాయకుల అండతోనే ఓపెన్ నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారని ఆయన విమర్శించారు. హౌస్ ట్యాక్స్, ఎల్ఆర్ఎస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నప్పుడు వారికి రక్షణ కల్పించాల్సిన భాద్యత కూడా మనదేనని ఆయన ప్రభుత్వానికి గుర్తు చేశారు. అధికారులు కళ్ళు మూసుకుని కూర్చున్నారన్న ఆయన ప్రభుత్వ సహాయం అందరికి అందాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే తాత్కాలిక సహాయం తీసుకోండని ఆయన ప్రజలని కోరారు. డ్రైనేజీ పైపు లైన్లు సక్రమంగా లేవన్న ఆయన. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోవాలని అన్నారు.