ప్రగతి భవన్, తెలంగాణ భవన్ లో ఐబీ వాళ్ళను పెడతా – కిషన్ రెడ్డి

-

బిజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటలిజెన్స్ పోలీసుల పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి… ఫోన్ లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా ? అని నిలదీశారు.

కార్యాలయంలోపలికి వస్తే బాగోదని కిషన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ప్రగతి భవన్, తెలంగాణ భవన్ లో ఐబీ వాళ్ళను పెడతా.. ఒప్పుకుంటారా ? అని నిలదీశారు. అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ రాష్ట్ర ఇంటలిజెన్స్ వారికి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయిస్తానని చాలెంజ్‌ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news