టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(43),నితీష్ రాణా(43) పరుగులతో రాణించారు. ఇక కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, రహానే అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. అయితే గత మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి ఒక్క వికెట్టూ తీయలేకపోయిన బుమ్రా… ఈ రోజు కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతా లో వేసుకున్నాడు.
ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకుంది. అయితే.. కేకేఆర్ జట్టు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 43 రన్స్), రహానే (25) శుభారంభం అందించగా.. వన్ డౌన్ లో వచ్చిన నితీశ్ రాణా చకచకా 43 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే.. రింకు సింగ్ 23 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (6), ఆండ్రీ రసెల్ (9) విఫలమయ్యారు. కుమార్ కార్తికేయ 2, డానియల్ శామ్స్ 1, మురుగన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.