కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సోయం బాపురావు

-

బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా రిజర్వేషన్ల అంశంపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మూర్ఖుడు, ఆదివాసీ, గిరిజన వ్యతిరేకి అని సోయం బాపురావు మండిపడ్డారు. గిరిజనులకు 9.8 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని, రాజ్యాంగ విరుద్ధంగా కులాన్ని, మతాన్ని కలిపి రిజర్వేషన్ బిల్లు కేంద్రానికి పంపించారని కేసీఆర్ పై ఆరోపణలు చేశారు.

కేసీఆర్ ఇదంతా ఓట్ల కోసమే చేస్తున్నారని, 9.8 రిజర్వేషన్ కోసం ఈనెల మండల కేంద్రాల్లో ఆందోళన చేపడుతామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, రైతులను సైతం కేసీఆర్ మోసం చేస్తున్నారని సోయం బాపురావు వ్యాఖ్యానించారు. ఇటీవల ఈ టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీని, కేంద్రాన్ని టార్గెట్ చేస్తోంది. గిరిజనులు, ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసిన బిల్లును కేంద్రం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ లీడర్లు విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news