కరోనా వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరికీ రోగనిరోధక శక్తి ఎంత ఇంపార్టెంటో తెలిసిపోయింది. ఆ కారణంగానే మార్కెట్లోకి రోగనిరోధక శక్తిని పెంచే అనేక ఆహారాలు, పానీయాలు లభ్యం అవుతున్నాయి. జలుబు, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలని తగ్గించడానికి రోగనిరోధక శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే చాలా వాటిల్లో సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందులో దాల్చిన చెక్క ఒకటి. దాల్చిన చెక్క, తేనె కలిపిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది శరీరంలో మలినాలని బయటకి తొలగిస్తుంది. దాల్చిన చెక్క అందుకు పూర్తిగా సహకరిస్తుంది. తేనెలో ఉన్న పోషకాలు, దాల్చిన చెక్కలోని లక్షణాలు, రెండూ కలిసి శరీరాని కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే దాల్చిన చెక్క, తేనెతో తయారు చేసిన టీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
ముందుగా కావాల్సిన పదార్థాలు
పావు కప్పు దాల్చిన చెక్క పొడి
ఒక టేబుల్ స్పూన్ తేనె
ఒక కప్పు నీళ్ళు
తయారీ విధానం
పొయ్యి మీద నీళ్ళు పెట్టి అందులో దాల్చిన పొడి వేసుకుని, బాగా మరిగే వరకు చూడాలి.
నీళ్ళు బాగా మరిగేలా రెండు మూడు నిమిషాల పాటు పొయ్యి మీదే ఉంచాలి.
దాన్ని ఒక కప్పులోకి తీసుకుని అందులో తేనె కలుపుకుని తాగితే సరిపోతుంది. మంచి ఫలితం రావాలంటే పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే బాగుంటుంది.
కొన్ని రోజుల పాటు ఈ పద్దతిని అవలంబిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాదు దాల్చిన చెక్కలోని లక్షణాలు జలుబు, దగ్గు నుండి ఉపశమనం ఇస్తాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం.