గోబర్ గ్యాస్ గురించి ఈ విషయాలను తెలుసుకోవాలి..!

-

గోబర్ గ్యాస్ గురించి ఒకప్పుడు బాగా వినిపించింది.. అప్పుడు చాలా మంది ఈ గ్యాస్ ను పెట్టుకున్నారు. ఈ గ్యాస్ను 1930 సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్తలు కనుగొనుట జరిగింది. పాడి పశువుల వ్యర్ధ పదార్థాలు, చెట్ల ఆకులు మరియు వంట గది వ్యర్థాలను గాలి రహిత స్థితిలో పులియ బెట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే వాయువును బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అంటారు.ఈ వాయువులో ప్రధానంగా మిథేన్ సుమారు 50-90 శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 25-45 శాతం, నైట్రోజన్ 0-10 శాతం, హైడ్రోజెన్ 0-3 శాతం మరియు నీరు 2-7 శాతం వరకు ఉంటాయి.

పాడి పశువుల వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారగుట అనేది నాలుగు దశలలో జరుగుతుంది. అవి 1. వ్యర్థ పదార్థాల లిక్విఫికేషన్ లేదా హైడ్రోలైసిస్ 2. ఎసిడిఫికేషన్ 3. ఎసిటిక్ యాసిడ్ తయారగుట వల్ల చివరకు మిథేన్ వాయువు తయారవుతుంది. ఒక కి.లో పాడి పశువుల పేడ నుండి సుమారు 0.03-0.04 క్యూబిక్ మీటర్ల గోబర్ గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది..

మొదటి సారిగా ప్రాంభించాలంటే సుమారు 2 టన్నుల పేడను నీటితో కలిపి బయోగ్యాస్ ప్లాంట్ ఇన్లెట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. దీనిని పంపించిన తరువాత ఈ ప్లాంటులోకి ఎటువంటి గాలి చొరబడకుండా దీని పై మూత వెయ్యాలి. 2-3 రోజులలో ఈ పేడ అంత ఎనరోబిక్  పెర్మంటేషన్ జరిగి మిథేన్ వాయువు తయారవుతుంది . ఈ గ్యాస్ను ఒక పైపు ద్వారా వంట గదిలోని స్టాకు కనెక్షన్ ఇచ్చి వంట గది అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

గోబర్ గ్యాస్ ప్లాంట్ నుండి బయోగ్యాస్ తయారైన తరువాత మిగిలిన వ్యర్ధాలు అవుట్లెట్ పైపు ద్వారా బయటకు వస్తుంది. ఈ స్లర్రీని వానపాములు వదిలినట్లైతే పర్మి కంపోస్టు తయారవుతుంది. ఈ విధంగా పాడి పశువుల పేడ నుండి బయోగ్యాస్ కాకుండా మంచి జీవ రసాయనాలు గల వర్మి కంపోస్టు కూడా తయారవుతుంది. 2 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్కు ప్రతిరోజు సుమారు 15 కిలో గ్రాముల పేడ అవసరముంటుంది..తక్కువ ఖర్చుతో ఉండటం వల్ల ఈ గ్యాస్ ను పల్లెల్లో వాడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news