ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలంతా కరోనా వైరస్ గురించి తెగ భయపడిపోతున్నారు. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో పరిష్కారం ఏంటి అనే దిశగా ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు ప్రయోగాలు మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఇటువంటి భయాందోళనల మధ్య ప్రజలు ఉంటుండగా ఇవన్నీ పక్కన పెట్టేసి ఏపీ మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మీడియా సమావేశంలో కొడాలి నాని ఇటువంటి టైం లో ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి బొచ్చు పీకుడు సొల్లు వాగుడు ఇలాంటి పదాలు వాడటం తో ప్రజలు మండిపడుతున్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందే రేషన్ ప్రజలకు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రజలు అంటారా షాపు దగ్గర సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా వ్యవహరిస్తున్నట్లు మీడియాలో వీడియోలు రావడం జరిగింది. అంతేకాకుండా రేషన్ కోసం వచ్చిన ఒక వృద్ధురాలు ప్రాణాలు కూడా కోల్పోయినట్లు వార్తలు రావటం బయటకు వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో పెన్షన్లు ఇంటికి ఇస్తున్న ప్రభుత్వం…రేషన్ కూడా ఇంటికి పంపించాలని టిడిపి నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని టిడిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాదులో ఉన్న చంద్రబాబును ఉద్దేశించి బండ బూతులు తిట్టారు.
అయితే చివరాకరికి మీడియా సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి నాయకులు ఇలా వ్యవహరించ కూడదని ఇది చంద్రబాబుని విమర్శించడానికి పెట్టిన మీడియా సమావేశం కాదు అంటూ కొడాలి నాని రేషన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరించారు. దీంతో అంతా తీట్టేసి చివర్లో ఇలా మాట్లాడటం ఏంటి..అమ్మో కొడాలి నాని జగన్ కి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నాడు అంటూ పార్టీలో ఉన్న నాయకులు కామెంట్స్ చేస్తున్నారట. గతంలో కూడా తిరుపతి వ్యవహారంలో ఇలానే వ్యవహరించారు మళ్లీ ఇప్పుడు ఇటువంటి టైం లో ఈ కామెంట్స్ అవసరమా అని అంటున్నారట.