పాపం నిజమైన టీడీపీ కార్యకర్తలు.. నిజమైన నికార్సైన పెద్దాయన అభిమానులు.. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో తెగ ఫీలయిపోతున్నారంట. ఎవరు అధినేత, ఎవరు సీఎం క్యాండిడేట్ అన్న విషయాల సంగతి తర్వాత… ముందు పార్టీని కాపాడుకోవాలి.. ముందు పార్టీని బ్రతికించుకోవాలి అని ఆలోచనలు చేస్తున్నారంట. ఈ క్రమంలో.. వారి కళ్ల ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ జూనియర్ ఎన్టీఆర్ అని ఆలోచిస్తున్నారంట.
అవును… చంద్రబాబు, చినబాబు కాదు… పెద్దాయన పెట్టిన పార్టీ ముఖ్యం అని భావించే నిఖార్సైన టీడీపీ కార్యకర్తలు ముందుగా పార్టీ మనుగడ కోసం ప్రాకులాడుతున్నారంట. కరోనా భయమో మరేదైనా కారణమో తెలియదు కానీ… రాష్ట్రం విడిచి ప్రజలకు ప్రాంతానికి దూరంగా బ్రతుకుతున్న టీడీపీ అధినేత & హిస్ సన్… సంగతి దేవుడెరుగు… ముందు పార్టీ బ్రతకాలి అని బలంగా నిర్ణయించుకున్న కొందరు టీడీపీ నేతలు జూనియర్ ని సప్రందించాలని భావిస్తున్నారంట.
ఇందులో భాగంగా జూనియర్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లేని కొందరు పెద్దలు కూడా… కొడాలి నానీని సంప్రదిస్తున్నారన్ని తెలుస్తోంది. అధికారం, ప్రతిపక్షం సంగతి దేవుడెరుగు కనీసం పార్టీగా మనుగడ కాపాడుకోవడం కోసమైనా జూనియర్ ని రంగంలోకి దించడం కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తామని అడుగుతున్నారంట. అయితే… ఈ విషయంలో జూనియర్ కోసం వచ్చే కాల్స్ ని కొడాలి నాని కట్ చేస్తున్నారని అంటున్నారు!
ఎవరు అవునన్నా కాదన్నా జూనియర్ గతం మర్చిపోడు కాబట్టి.. ఆ గతంలో ఆయన బాల్యంలో కొడాలి నాని చాలా ముఖ్యుడు కాబట్టి… కచ్చితంగా కొడాలి నాని ప్రమేయం జూనియర్ ని కలిసే విషయంలో చాలా ముఖ్యమని అంటున్నారు తమ్ముళ్లు! మరి… టీడీపీ భవిష్యత్తు ఎలా మారబోతోంది అనేది వేచి చూడాలి!! బాబు ఇప్పటికైనా మారాలి అని తమ్ముళ్లు కోరుకుంటున్నారంట. పవన్ ఇంటికే వెళ్ళి పబ్బం గడుపుకున్న బాబు… మేనల్లుడు ఇంటికి వెళ్లి బ్రతిమాలడానికొచ్చిన నామోషీ ఏమిటంట అన్ని ఫీలవ్వుతున్నారంట!