ఈనాడు, ఏబీఎన్, టీవీ5, జనసేనలను ఉత్తరాంధ్ర ప్రజలు నిషేదించాలి – కొడాలి నాని

-

ఏపీలో TDP, జనసేన అలాగే, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, జనసేనలను ఉత్తరాంధ్ర ప్రజలు నిషేదించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. విశాఖకు పరిపాలన రాజధాని సాధించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. ఇవాళ విశాఖ గర్జనలో కొడాలి నాని పాల్గొని మాట్లాడారు. బాబు స్వార్థపూరిత ఆలోచనలు సమర్థిస్తున్న రాజకీయ పార్టీలు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు.

అమరావతి రాజధానిని గ్రాఫిక్స్ లో చూపించారు.. ఉత్తరాంధ్రపై కొందరు కుట్రచేస్తున్నారు. విశాఖ రాజధాని కావాలని అంతా కోరుకోవాలి… ఒక్క అమరావతిలోనే టీడీపీ ఉందా? టీడీపీ, జనసేనను ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలని డిమాండ్‌ చేశారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news