ఏపీలో ముందే వచ్చిన సంక్రాంతి.. కోడి పందేల హడావుడి షురూ

-

ఏపీలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగకు ఇంకో వారం రోజుల సమయమున్నా.. ఇప్పుడే కోళ్ల పందేలు షురూ అయ్యాయి. తాజాగా బాపట్ల జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ చేస్తున్నా బేఖాతరు చేస్తూ అడవులదీవిలో ఆదివారం జోరుగా కోడిపందేలు నిర్వహించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో పందేలు జరుగుతున్నా పోలీసులు కనీసం ఆ చుట్టుపక్కలకు వెళ్లలేదు. విమర్శలు రావడంతో ఎట్టకేలకు పోలీసులు సోమవారం బరిని ధ్వంసం చేశారు.

సంక్రాంతి నేపథ్యంలో తీర ప్రాంతంలో భారీగా బరుల ఏర్పాటుకు కొందరు నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికార పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడి అభయం తీసుకుంటున్నారు. బరికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పేందుకు సైతం నిర్వాహకులు వెనకాడటంలేదు. నూతన సంవత్సర వేడుకల పేరుతో బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీగా కోళ్ల పందేలు నిర్వహించారు. తీరంలో జూద శిబిరాలు ఎప్పటి నుంచే కొనసాగుతున్నాయి. రోజూ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news