ఈ ఏడాది ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి.రన్ మెషిన్ గా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఈ స్థాయిలో తంటాలు పడుతూ ఉండడం కెరీర్లో బహుశా ఇదేే తొలిసారి.దీంతో కోహ్లీ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.ఒకరకంగా కోహ్లీ టీంకు భారంగా మారాడనే చెప్పాలి.ఓపెనర్ గా వచ్చిన, వన్ డౌన్ లో వచ్చిన, బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడ వచ్చినా కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అవుతున్నాడు.ఇప్పటివరకు ఈ ఏడాది ఐపీఎల్ లో 9 మ్యాచులు ఆడిన కోహ్లీ 128 పరుగులు మాత్రమే చేశాడు.లక్నో సూపర్ జెంట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో అయితే తొలి బంతికే పెవిలియన్ బాట పట్టాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు.
విరాట్ కోహ్లీ వెంటనే ఐపీఎల్ నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు.ఏకధాటిగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి కాస్తంత విరామం అవసరమన్నాడు.మూడు ఫార్మాట్లలోనూ గతంలో జట్టుకు సారథిగా వ్యవహరించిన కోహ్లీకి ఇప్పుడు విశ్రాంతి కావాలని, మైండ్ ను ఫ్రెష్ చేసుకోవాలని సూచించాడు.తన అంతర్జాతీయ కెరీర్ ను పొడిగించుకోవాలనుకున్నా..క్రికెట్ లో మరికొంత కాలం తనదైన ముద్ర వేయాలన్న కోహ్లీ తక్షణం ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే మేలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.అంతర్జాతీయ ఆటగాడిగా అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికాడు.