34 బంతుల్లోనే అర్ధసెంచెరీ చేసిన విరాట్…విరాట్ భార్య అనుష్క సంబరం

-

ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లి మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 147.06గా నిలిచింది. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లి హాఫ్ సెంచరీ (61) సాధించాడు. అదే సమయంలో, ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో, కోహ్లి తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత చాలా దూకుడుగా స్పందించాడు. ఐపీఎల్ 2023లో వరుసగా రెండో అర్ధ సెంచరీని పూర్తి చేసిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా దూకుడుగా స్పందించాడు. కింగ్ కోహ్లి స్పందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Anuskha sharma erupts in joy after virat scores half century

ఈ వైరల్ వీడియోలో అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత, కోహ్లి చాలా కోపంగా కనిపించాడు. తన హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్న వీడియో చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హాఫ్ సెంచరీ తర్వాత గుండెను బలంగా గుద్దుతూ.. పెవిలియన్ వైపు బ్యాట్ చూపిస్తూ.. సెలబ్రేట్ చేసుకున్నాడు. ఢిల్లీపై ఈ అర్ధ సెంచరీ ద్వారా కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో 47వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్ భార్య అనుష్క శర్మ ఆనందానికికైతే అంతేలేకుండా పోయింది. భర్త అర్థసెంచరీ కొట్టడం చూసి ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. ముఖమంతా నవ్వు పరుచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా అవుతోంది. ‘‘రాజు తన రాణిని ఎన్నడూ నిరాశ పరచడు’’ అన్న క్యాప్షన్‌తో విడుదలైన ఈ వీడియో నెట్టింట ఎంతగా హల్‌చల్ చేస్తోందో మాటల్లో చెప్పడం కష్టం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news