ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళవారం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 71వ రోజు పాదయాత్రను డోన్ నియోజకవర్గం పొలిమేరమెట్ట క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు. కాసేపటి క్రితమే డోన్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర పూర్తై పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జ్ కేఈ శ్యాంబాబు, కర్నూలు జిల్లా ముఖ్య నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి టీడీపీ యువనేతకు స్వాగతం పలికారు.అక్కడ నారా లోకేష్ ప్రసంగిస్తూ, ‘‘నేను దమ్ము, ధైర్యంతో ప్రజల్లో నడుస్తున్నా.
నేను ఎవరికీ భయపడే వాడిని కాదు. వివేకా హత్య కేసులో సీబీఐ కరెక్ట్‌గా దర్యాప్తు చేస్తే అరెస్ట్‌ల లింకులన్నీ తాడేపల్లి కొంపకు వెళ్తాయి. జగనాసుర రక్త చరిత్ర ఇదే. జగన్‌కు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. గ్రామంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తాం. పేదలపై జగన్‌రెడ్డి కక్షసాధింపు వైఖరి ప్రదర్శిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే లబ్దిదారులకు పెండింగ్ బిల్లులు అందజేస్తాం. రంగాపురం ఎన్టీఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం’’ అని లోకేశ్ ప్రకటించారు. మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పరదాలు పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ పరిపాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.