మునుగోడు ప్రచారానికి వెళ్తా: వెంకట్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు, మునుగోడు ఉప ఎన్నికలపై ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం పిలిచి తెలంగాణ కాంగ్రెస్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో ప్రియాంకా గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వెళ్తానని ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే వెంటనే ప్రచారం చేసేందుకు వస్తానని స్పష్టం చేశారు వెంకట్ రెడ్డి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో తన నివాసంలో భేటీ అయిన ఆయన..మునుగోడు ఉపఎన్నిక.. పార్టీలో తాజా రాజకీయ పరిణామాలు..అభ్యర్థి ఎంపిక వంటి అంశాలపై చర్చించారు వెంకట్ రెడ్డి.

Telangana: Komatireddy Venkat Reddy gave clarity on party change.. How can  he do that.. » Jsnewstimes

ఈ సందర్భంగా మనుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తానని తెలిపారు వెంకట్ రెడ్డి. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో తన అభిప్రాయాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తెలిపానని చెప్పారు వెంకట్ రెడ్డి. ఎవరి పేరు సూచించానో చెప్పలేనని..అది పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని తెలిపారు వెంకట్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తానని ప్రియాంక గాంధీకి చెప్పాన్నారు. ఇప్పుడు మా నాయకుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు చెప్పానని అన్నారు వెంకట్ రెడ్డి.