జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు..

తెలంగాణలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయనేతలు పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణాలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అంటూ చేరికలు జరుగుతున్నాయి. అయితే.. తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌గానే కాకుండా కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సోద‌రుడు ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు విప‌క్ష బీజేపీలో చేరిపోయారు. త‌న ముఖ్య అనుచ‌రుల‌తో క‌లిసి గురువారం ఢిల్లీ వెళ్లిన ప్ర‌దీప్ రావు బీజేపీలో చేరారు. ప్ర‌దీప్ రావును బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.

telangana bjp, జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న ఎర్రబెల్లి - errabelli  pradeep rao joined bjp - Samayam Telugu

తెర ముందు ద‌యాక‌ర్ రావు క‌నిపిస్తున్నా… తెర వెనుక అన్న గెలుపు కోసం తాను ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాన‌ని, అయితే త‌న‌కు త‌గిన రీతిలో గుర్తింపు ద‌క్క‌ని కార‌ణంగా తాను టీఆర్ఎస్ ను వీడుతున్న‌ట్లుగా ఇటీవ‌లే ప్ర‌దీప్ రావు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌దీప్‌రావు పార్టీని వీడ‌కుండా ఉండేలా టీఆర్ఎస్ సాగించిన రాయ‌బారం ప‌ని చేయ‌లేదు. గ‌తంలో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మ‌న్‌గా ప్ర‌దీప్ రావు ప‌నిచేశారు.