తెలంగాణలో కాంగ్రెస్‌లో కీలక నేతల్లో ఒకరు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అయితే.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లినాటి నుంచి వెంకట్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుండాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన తాను చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని సంచలన ప్రకటన చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ మేరకు తాను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మాట ఇచ్చానని కూడా చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే సమయంలో సోనియా గాంధీతో తాను జరిపిన సంభాషణను కోమటిరెడ్డి ప్రస్తావించారు.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నామని, మీరంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని తమను సోనియా గాంధీ కోరారని వెంకట్ రెడ్డి చెప్పారు. ఆ మాటకు ప్రతిగా తాను చనిపోయే దాకా కాంగ్రెస్ పార్టీని వీడబోనని సోనియాకు మాట ఇచ్చానని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి అన్న ఆయన… కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. తాను పార్టీ పదవిని మాత్రమే ఆశించానన్న వెంకట్ రెడ్డి… మంత్రి, ముఖ్యమంత్రి పదవులు తనకు అవసరం లేదని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.