Komuram Bheemudo Promo : ఆర్ఆర్ఆర్ నుంచి ఫోర్త్ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఎన్టీఆర్ ఫాన్స్ కు ఇక జాతరే

-

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫ్యాన్స్ కు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ సినిమా నుంచి నాలుగవ సింగిల్ ను విడుదల చేసింది చిత్ర బృందం. కాసేపటి క్రితమే revolt of Bheem పేరుతో సాంగ్ ప్రోమో విడుదల చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా బృందం. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రోమో లో ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయింది.

అటు లిరిక్స్, ఇటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ రేంజ్లో ఉంది. ఈ పూర్తి పాటను రేపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో చిత్రబృందం విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ తాజా అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news