చైనా అమెరికా తర్వాత 3వ పెద్ద దేశంగా భారత్ ఉండబోతోందని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. మోడీ సభకు జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు… ఇది పార్టీకి సంబందించిన సభ కాదు అధికారిక సభ తెలిపారు. 11 వేల కోట్ల అభివృద్ధి పనులకు ఇక్కడ నుండి శంకు స్థాపన చేస్తున్నారు ప్రధాని అని.. ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించ లేదని ఫైర్ అయ్యారు.
ప్రధాని మోడీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది… మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థలో పదో స్థానం నుండి ఐదో స్థానానికి చేరుకున్నామని పేర్కొన్నారు. మరో మూడు ఏళ్లలో చైనా అమెరికా తర్వాత మూడో అతి పెద్ద దేశంగా భారత్ ఉండ బోతోందన్నారు. సింగరేణి నీ బీజేపీ ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయలేరు.. కేసీఆర్ చేశారని ఫైర్ అయ్యారు. పేపర్ లీకేజీ చేసి మాపై బురద జల్లినట్టు… కేసీఆర్ ప్రయివేటీకరణ చేసి బీజేపీ పై బురద జల్లుతున్నాడని ఆగ్రహించారు కొండా విశ్వేశ్వర రెడ్డి.