పరిశ్రమలో నన్ను తొక్కేశాడు..రఘు బాబుపై కృష్ణ భగవాన్ సంచలనం !

-

టాలీవుడ్‌ కమెడీయన్ లలో కృష్ణ భగవాన్‌ ఒకరు. అతను ఓ ఊపు ఊపాడు. వెండి తెరకు మధ్యలో కొద్ది రోజులు దూరంగా ఉన్నాడు. ఆరోగ్య సమస్య కారణంగానే సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు కృష్ణ భగవాన్‌ బుల్లితెరపై సందడి చేస్తున్నాడు.

మొన్న జాతి రత్నాలు అనే స్టాండప్‌ కామెడీ షో ప్రారంభోత్సవంలో కృష్ణ భగవాన్‌ సందడి చేశారు. ఇందులో అతను చేసిన కామెడీ, పంచ్‌ లు మామూలుగా లేవు. అలాగే సుమ అడిగిన ప్రశ్నలకు అన్నింటికి కూడా రఘుబాబే అని ఆన్సర్ చెబుతూ.. అందరినీ అలరించాడు.

ఈ నేపథ్యంలోనే.. చిత్ర పరిశ్రమలో మిమ్మల్ని ఎవరైనా తొక్కేయాలని చూశారా అని సుమ మరో ప్రశ్నను కృష్ణ భగవాన్‌ కు వేసింది. అవును.. రఘుబాబు తనను తొక్కేశాడు అని ఫన్నీగా ఆన్సర్‌ ఇచ్చాడు కృష్ణ భగవాన్‌. ఎవరైనా ఒకరిని తుక్కు తుక్కు కొట్టమంటే ఎవరినీ కొడతారు అని ఇంకో ప్రశ్న అడుగుతుందని సుమ. దీనికి ఆన్సర్‌ చెప్పెలోపే సమీర్‌ అందుకుని.. ఇంకెవరు రఘుబాబేఅని కౌంటర్‌ వేస్తాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news