జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లు లను అందిస్తూనే ఉంది..తాజాగా మరో గుడ్ న్యూస్ ను అందించింది.ఏపీ కృష్ణా జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలను కలిస్తున్న విషయం పై కీలక ప్రకటన చేసింది.కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం ఉద్యోగాల పూర్తీ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు సంఖ్య: 28
ఆరోగ్య మిత్ర పోస్టులు: 22
టీమ్ లీడర్ పోస్టులు: 6
అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్)/ఎమ్మెస్సీ (నర్సింగ్)/బీఫార్మసీ/ఫార్మా డి/బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా కమ్యునికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
జీతం : నెలకు రూ.15,000ల నుంచి రూ.18,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయస్సు: అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: జిల్లా కో ఆర్డినేటర్, డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ హెల్త్ కేర్ ట్రస్ట్, కృష్ణా జిల్లా, ఏపీ.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 11, 2022.