షాకింగ్ : కేంద్రం ఆధీనంలోకి కృష్ణా, గోదావరి బోర్డులు !

-

జిఆర్ఎంబి, కెఆర్ఎంబి పరిధిలోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగింది కేంద్రం. ఇందులో భాగంగానే గెజిట్ నోటిఫికేషన్ పై ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. జిఆర్ఎంబి, కెఆర్ఎంబిలకు ప్రత్యేక అధికారులు నియమించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 15వ తేదీనుంచి రెండు బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించడంలో ప్రాజెక్టుల సాఫీగా స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగింది కేంద్రం.

జిఆర్ఎంబికి ఇద్దరు, కెఆర్ఎంబికి మరో ఇద్దరు అధికారుల నియామకం చేయనుంది. కేంద్ర జలసంఘంలోని ఛీఫ్ ఇంజనీర్ డాక్టర్ ఎంకె మిశ్రా, మరో ఛీఫ్ ఇంజనీర్ జికె అగర్వాల్ గోదావరి బోర్డులో నియామకం కానున్నారు. కెఆర్ఎంబికి ఛీప్ ఇంజనీర్ టికె శివరాజన్, మరో ఛీఫ్ ఇంజనీర్ అనుపమ ప్రసాద్ నియామకం కానున్నట్లు సమాచారం. ఈ నలుగురు అధికారులు వెంటనే ఛైర్మన్ లకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు బోర్డులలో ఈ అధికారులు పూర్తిస్ధాయిలో పనిచేయాలని నిర్ధేశించిన కేంద్రం.. బోర్డులల్లో ఉద్యోగుల నియామకం, ఇతర పనులను చక్కదిద్దే భాద్యతను ఛీఫ్ ఇంజనీర్లకు అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news