సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ ను సందర్శించిన కేటీఆర్

-

సిరిసిల్లలో బీసి స్టడీ సర్కిల్ ను సందర్శించారు రాష్ట్ర మంత్రి కేటీఆర్.అభ్యర్థులకు రూ.2 లక్షల రూపాయల స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో శాశ్వత బిసి స్టడీ సర్కిల్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల లో 500 మందికి శిక్షణ ను ఎస్సీ, స్టడీ సర్కిల్ లో శిక్షణ ఇస్తున్నామన్నారు.500 మందికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ను సినారె కళా మందిరంలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.1000 పై చిలుకు మందికి ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు.మరో 134 స్టడీ సర్కిల్ లను సిఎం గారు మంజూరు చేశారని అన్నారు.తెలంగాణ ఏర్పాటై 8 ఏండ్లు అయ్యిందని,నిధులు, నీళ్ళు, నియామకాల కోసమే ఉద్యమం జరిగిందన్నారు.

సిరిసిల్ల, వేములవాడ దుర్భిక్ష ప్రాంతాలు,సాగు జలాలు అటుంచి.. త్రాగు జలాలకు గోస పడే పరిస్థితులు ఉండేవన్నారు.బోర్లు వేసి బొక్క బోర్లా పడ్డ తెలంగాణ, సాగు త్రాగు నీరు రంగంలో స్వయం సమృద్ది చేశామన్నారు. 75 ఏండ్లలో ఎవ్వరూ చేయని పని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ త్రాగు నీరు ఇచ్చామన్నారు.40 కోట్ల ఎకరాల సాగుకు యోగమైన భూమి ఉంది.70 వేల టీఎంసీ ల నీరు నదుల లలో అందుబాటులో ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news