సమంత.. తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అక్కడ బాగా పాపులారిటీ పొందిన సెలబ్రిటీ షో అయినటువంటి కాఫీ విత్ కరణ్ షో కి హాజరయ్యింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే తన భర్తతో ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయానికి సమాధానం చెబుతూనే మరొకవైపు తన భర్త పై తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాదు ఈ వివాదం లోకి తన మామ నాగార్జునను కూడా దింపి మరింత రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సమంత చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర చర్చనీయాంశంగా మారుతూ ఉండడం గమనార్హం. ఇదిలా వుండగా నాగచైతన్య ఏ రోజు కూడా.. ఎక్కడా కూడా సమంత గురించి నెగిటివ్గా మాట్లాడలేదు అంతేకాదు తాము విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు.
కానీ సమంత మాత్రం ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమాత్రం నోరు విప్పకుండా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన భర్త పై పలు వ్యాఖ్యలు చేసింది. ఇక అంతేకాదు తామిద్దరిని ఒకే గదిలో ఉంచితే కత్తులు, కటారులు లేకుండా చూసుకోమని కూడా చెప్పింది. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య సెగ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలతో ఈమె కలిసి నటించిన విషయం తెలిసిందే
ఇక ఇందులో భాగంగానే స్టార్ హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ తన భర్త నాగ చైతన్య గురించి తప్పుగా మాట్లాడడంతో ఆయన అభిమానులు సమంతా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు స్టార్ హీరోల గురించి ఆమె మాట్లాడుతూ.. ముందుగా రామ్ చరణ్ తో ఈమె రంగస్థలం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ అతడు ఒక గ్యాంగ్ స్టార్ అని వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ ను చూసిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అతను ఒక మ్యాజిక్ అంటూ తెలిపింది. ఇక అలాగే ధనుష్ హాలీవుడ్లో ది గ్రే మాన్ తో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే . అతడు గ్లోబల్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఇక కట్టుకున్న భర్త గురించి విమర్శలు గుప్పిస్తూ ఇతర స్టార్ హీరోల పై ప్రశంసలు కురిపిస్తుంటే చైతూ అభిమానులు సమంతా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.