పీయూష్‌కు కేటీఆర్‌ రిక్వెస్ట్‌.. అలా చేస్తే వేలాది మందికి ఉపాధి..

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఓ విన్నపం చేశారు. ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ ను సమీక్షించి, దాన్ని పునరుద్ధరించాలని విన్నవించారు. దీనికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్టు కేటీఆర్‌ అన్నారు. యూనిట్ పునరుద్ధరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని, ఈ యూనిట్ పునరుద్ధరింపబడితే… ఆదిలాబాద్ కు చెందిన వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

Amit Shah The 'King Of Lies', Says KTR | Nation

మరోవైపు యూనిట్ కు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన ట్వీట్ ను, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను షేర్ చేశారు. ‘ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను పునరుద్ధరించాలని, జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా పోరాడుతుంటే.. మరోవైపు పరిశ్రమ తొలగింపునకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అంటూ జోగు రామన్న ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news