ఏపీ ప్రజలకు అలర్ట్‌..ఆ జిల్లాలలకు పిడుగుల హెచ్చరిక

-

ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే.. ఏపీలోని కొన్ని జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల సంస్థ. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు,అన్నమయ్య, కర్నూలు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేశారు డైరెక్టర్, విపత్తుల సంస్థ డా.బిఆర్ అంబేద్కర్. తిరుపతి జిల్లాలోని తిరుపతి అర్బన్, రేణిగుంట,నారాయణవనం, కెవిబి పురం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు ప్రాంతాల్లో పిడుగులు పడుతాయని హెచ్చరించారు.

అలాగే.. చిత్తూరు జిల్లాలోని.. నగరి, నిండ్ర, విజయపురం, అన్నమయ్య జిల్లాలోని.. కురబలకోట, మదనపల్లె, బి.కొత్తకోట, గుర్రంకొండ, కలికిరి,వాయల్పాడులోనూ పిడుగులు పడతాయని వార్నింగ్‌ ఇచ్చారు. కర్నూలు జిల్లాలోని చిప్పగిరి, మద్దికెర ఈస్ట్, ఆదోని, ఆస్పరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు మండలాలు మరియు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news