మిస్టర్‌ కేటీఆర్‌ ఎక్కడున్నావ్‌.. మీరిచ్చిన 12 కోట్ల ఉద్యోగాలు వెతుకుతున్నా..!

-

ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ వేడి పేరుగుతోంది. ప్రధానంగా ఉద్యోగాల కల్పనపైనే రాదంతం జరుగుతుంది. ఇచ్చామని అధికార పక్షం.. అబద్దామని ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌ ఉద్యోగాల విషయమై టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించగా, ఇటీవల బీజేపీ సైతం అదే విషయమై అధికార టీఆర్‌ఎస్‌పై ప్రశ్నలపై ప్రశ్నలు గుప్పిస్తోంది. వీటిపై స్పందించిన రాష్ట్రమంత్రి కేటీఆర్‌ తామిచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేశామనడంతో బీజేపీ నాయకులు తప్పుబడుతున్నారు.

చర్చకు రావాలి..

రాష్ట్రంలో ఏ ఏ శాఖలో ఎనెన్ని ఉద్యోగాలు కల్పించారో ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌ రావు కేటీఆర్‌కు సవాల్‌ చేయగా, బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో తెలుపాలని కేటీఆర్‌ ప్రతి పవాల్‌ విసిరారు. సోమవారం ఆర్ట్స్‌ కాలేజీకి వెళ్లిన రాంచందర్‌ ‘నేను ఆర్ట్స్‌ కాలేజీ వద్ద ఉన్నాను.. ఎక్కడున్నావ్‌ మిస్టర్‌ కేటీఆర్‌? అంటూ రాంచందర్‌ రావు ట్వీట్‌ చేశారు.

ఎన్‌డీఏ అంటే నో డాట అవైలబుల్‌..

దీనిపై స్పందించిన కేటీఆర్‌ రాంచందర్‌రావుకు చురకలంటించారు. మోదీ అధికారంలోకి రాకముందు బీజేపీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ‘ మీరు అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు (ఇప్పటి వరకు 12 కోట్లు). దీంతో పాటు జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న వారందరీ రూ. 15 లక్షలు జమ చేస్తామని చెప్పారు కదా.. ఇవన్నీ ఎంత వరకు నెరవేర్చారో అనే పనిలో నిమగ్నమయ్యాను. దీనికి ఎన్‌డీఏనే సమాధానం చెప్పాలి. ఎన్‌డీఏ అంటే నో డాటా అవైలబుల్‌’ అంటూ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు. తన ప్రశ్నకు సమాధానం ఉంటే షేర్‌ చేయలని మరోక సవాల్‌ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఈ మాటల యుద్ధం ఆగేలా లేదని నగరవాసులు చర్చించుకుంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news