అప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది : కేటీఆర్‌

-

పీసీసీ రేవంత్‌రెడ్డికి జానారెడ్డి సంస్కారం నేర్పాలని.. కేసీఆర్‌కు పిండం పెట్టాలనుప్పుడు ఆయన సంస్కారం ఎక్కడికి పోయిందంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌ జల విహార్‌లో బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలు, వార్‌రూమ్‌ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కాంగ్రెస్‌ తీరుపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతల వద్ద సంస్కారం నేర్చుకోవాలని ఖర్మ లేదని, రూ.50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శించారు.

Minister KTR LIVE | KTR Public Meeting at Khammam | CM KCR | Cinema Garage  - YouTube

అంతకుముందు రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి. కేటీఆర్‌కు సంస్కారం లేదని.. రాహుల్ గాంధీపై సంస్కారం లేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు ఏ పదవి లేకుండా స్వాతంత్య్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ కాదా అని జానారెడ్డి ప్రశ్నించారు. ఉపాధి హామీ, ఆహార భద్రత, అటవీ హక్కులు, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కదా అని ఆయన నిలదీశారు. కరెంట్ ఉత్పత్తికి కృషి చేసింది తామేనని.. వాటిని మీరు కొనసాగిస్తున్నారని జానారెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌ని సహించే పరిస్ధితిలో జనం లేరని.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ. 5.50 లక్షల కోట్లు అప్పు చేశారని జానారెడ్డి ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా వుందని.. 2004లోనే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news