కేటీఆర్ బర్త్ డే…వారికి ఉచితంగా బైక్ లు!

మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో ఎవరైనా.. సహాయం కావాలని కోరిన వెంటనే… మంత్రి కేటీఆర్‌ స్పందిస్తారు. వారికి కావాలసిన సహాయాన్ని చేసేస్తారు కేటీఆర్‌. అయితే… మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు ఈ నెల 24న జరుగనుంది. దీంతో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, ఆయన ఫ్యాన్స్‌ పుట్టిన రోజు ఏర్పాట్లల్లో ఫుల్‌ బిజీ అయ్యారు.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌.. తన బర్త్‌ డే సందర్భంగా కీలక ప్రకటన చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ లో భాగంగా వంద మంది వికాలంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

గతేడాది గిప్ట్‌ ఏ స్మైల్‌ లో భాగంగా తాను 6 అంబులెన్స్‌లను విరాళంగా ఇవ్వగా.. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు.. మరియు నేతలు 90 అంబులెన్స్‌ లను ఇచ్చినట్లు సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్. అయితే… కేటీఆర్‌ ప్రకటనపై మంత్రులు పువ్వాడ అజయ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, సైదిరెడ్డి, జీవన్ రెడ్డి, విద్యాసాగర్‌ రావు లాంటి ఇతర నాయకులు కూడా వికలాంగులకు ఉచితంగా వాహనాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.