మిషన్‌ భగీరథకు మరో అవార్డు.. కేంద్రంపై కేటీఆర్ సెటైర్

-

తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి మరో పురస్కారం దక్కింది. ఇంటింటికి తాగు నీరు నినాదంతో శుద్ధమైన జలాన్ని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరో అవార్డును ప్రకటించింది. జాతీయ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు. గాంధీజయంతి రోజున దిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఈ అవార్డు అందిస్తారు.

రాష్ట్రప్రగతిని గుర్తించి మరోమారు జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేసినందుకు కేంద్రం, జల్‌జీవన్ మిషన్‌కి రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

మిషన్ భగీరథకు కేంద్రం అవార్డు ప్రకటించడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలన్న నీతిఆయోగ్ సిఫారసులను ఎన్డీయే ప్రభుత్వం గౌరవిస్తే ఇంకా బాగుంటుందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news