సీఎం కేసీఆర్ ఎన్నో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు : కేటీఆర్‌

-

సీఎం కేసీఆర్ దార్శనికత కారణంగానే 9 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నది. కేసీఆర్ నాయకత్వంలో పరిశ్రమలు, భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు ఇవ్వడం చాలా గొప్ప విషయం.

KTR: ఈ-గవర్నెన్స్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌: మంత్రి కేటీఆర్‌ |  minister ktr speech at ward officers orientation programme in hyderabad

మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో తెలంగాణ పునరాగమనంలో ఉన్నదని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి వేడులకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీలో స్వచ్ఛ బడిని ప్రవేశపెడుతున్నాము. ఈ బడి ద్వారా తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసే విధానం.. కంపోస్టు ఎరువును ఎలా తయారు చేయాలనే అంశాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. స్వచ్ఛ బడి కాన్సెప్ట్‌ను సిద్దిపేటలో ప్రారంభించిన దీప్తిని.. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌గా నియమిస్తున్నట్లు వేదిక మీద ప్రకటించారు. ఈ స్వచ్ఛ బడి కార్యక్రమాన్ని అందరు మున్సిపల్ కమిషనర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు. ఏక కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.

 

ఇక్క‌డితోనే సంతోష‌ప‌డిపోవ‌ద్దు.. మ‌నం సాధించాల్సింది ఇంకా ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు. ర‌జ‌నీకాంత్ హైద‌రాబాద్ అభివృద్ధిని మెచ్చుకున్నారు. ఆయ‌న వంద‌ల దేశాలు తిరిగిన వ్య‌క్తి. ఆయ‌న వ‌చ్చి హైద‌రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల‌కు వెళ్తే ఇది న్యూయార్క్‌లా అనిపించింద‌న్నారు. ఇది మా ఎస్ఆర్‌డీపీ అధికారులు, ఇంజినీర్ల గొప్ప‌త‌నం. క‌రోనా కాలంలో అంద‌రూ త‌మ‌ప‌నులు వ‌దిలి వెళ్లిపోతే.. మా అధికారులు, ఇంజినీర్లు హైద‌రాబాద్ న‌గ‌రంలో రాత్రింబ‌వ‌ళ్లు ప‌ని చేసి రోడ్లను, ఫ్లై ఓవ‌ర్ల‌ను శ‌ర‌వేగంగా నిర్మించారు. వారికి అభినంద‌న‌లు. కార్మికుల్లో ధైర్యం నింపి, వారిలో విశ్వాసం నింపి ప‌ని క‌ల్పించారు మ‌న అధికారులు అని కేటీఆర్ కొనియాడారు.
హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 వేల మంది శానిటేష‌న్ సిబ్బంది ప‌ని చేస్తున్నార‌ని కేటీఆర్ తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌ట్ట‌ణాన్ని ప‌రిశుభ్రంగా ఉంచారు. వారికి కూడా ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాం. భార‌త‌దేశంలో అత్య‌ధిక వేత‌నం అందుకున్న స‌ఫాయి కార్మికులు మ‌న ద‌గ్గ‌రే ఉన్నారు. స‌ఫాయి కార్మికుల‌కు ప్ర‌జ‌లు స‌హ‌కారం అందించాలి అని కేటీఆర్ కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news