దేశభక్తి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరు… బీజేపీపై కేటీఆర్ ఫైర్

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వరి మంటలు చల్లారడం లేదు. రెండు పార్టీలు వరి ధాన్యం కొనుగోలు అంశంపై ప్రతీ రోజు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల కేసీఆర్ మాటలకు కౌంటర్ గా నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు మీకు ఢిల్లీలో ఏం పని అంటూ రెచ్చిపోయారు. ధాన్యం కొంటరా.. కొనరా.. అంటూ ప్రశ్నించారు.

మరోవైపు కేసీఆర్ ను దేశద్రోహి అంటూ బీజేపీ నాయకులు విమర్శించడంపై టీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటోంది. తాజాగా సీఎం కేసీఆర్ దేశద్రోహి అన్న వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఓ వైపు కరోనా.. మరో వైపు చలి చంపేస్తున్నా.. ఏడాది పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని.. అలాంటి రైతులను వీధిపాలు చేసిన వారు దేశభక్తులా..? అంటూ ప్రశ్నించారు. దేశభక్తిపై సర్టిఫికేట్ ఇచ్చేందుకు ఈ మూర్ఖులు ఎవరని మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల పంజాబ్ రైతులకు రూ.3 లక్షలు పరిహారాన్ని కేసీఆర్ ప్రకటించారు. అయితే దీనిపై బీజేపీ నాయకులు దేశద్రోహి అనే వ్యాఖ్యలు చేశారు.