సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటన పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ నాయకులు విస్మరించారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంకా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు.

రైతు బంధు గురించి అడిగితే తమపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రైతులు అడగకుండానే తమ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కరువు తెచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ సరిగ్గా ఉండటం లేదని.. మంచి నీళ్లకు గోస అవుతోందన్నారు. మిషన్ భగీరథతో గూడాలు, తండాలకు నీళ్లు అందించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అసిఫాబాద్ వంటి ప్రాంతాలకు కూడా నీళ్లు అందించారని గుర్తు చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news