తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.లక్ష ఆర్థిక సాయం

బీసీ కుల వృత్తుల, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని జూన్ 9న సంక్షేమ సంబరాల దినోత్సవం నాడు లాంఛనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం సంగారెడ్డి నుంచి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనగా, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీసీ కుల, చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.

Busy schedule awaits CM KCR in Nirmal - Telangana Today

కులవృత్తుల వారికి ఆర్థిక సాయం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అన్నారు. లబ్ధిదారులను గుర్తించి ప్రతి నెల 15వ తేదీన ఎమ్మెల్యేలతో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ పథకం కింద పనిముట్లు, పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆయా కులవృత్తుల లబ్ధిదారులకు సహకరిస్తామని, అదే సమయంలో వాటిని ఆన్ లైన్ లో నమోదు చేసి రెండేళ్ల వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు.